కీవ్: ఉక్రెయిన్‌పై (Ukraine) రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుద్ధం ప్రకటించారు. దీంతో రష్యా దళాలు ఆ దేశంపై విరుచుకుపడుతున్నాయి. సైనిక, వైమానిక స్థావరాలు, ఆయుధ కేంద్రాలపై బాంబుల వర్షం కురిపించాయి. మిలిటరీ ఆపరేషన్ ప్రారంభించిన కొన్ని గంటల్లోనే ఉక్రెయిన్‌లోని మెరియోపోల్, లుహాన్స్క్, షాష్ట్యా, క్రమెటోస్క్, సెన్‌కివ్కా, వీవ్, ఇవాన్ ఫ్రాంక్ఇవ్స్క్ వంటి ప్రధాన ప్రాంతాలపై దాడులు చేశాయి.
తొలిరోజు రష్యా దాడుల్లో 137 మంది ఉక్రేనియన్లు చనిపోయారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్స్కి (Volodymyr Zelensky) ప్రకటించారు. ‘ఈ రోజు 132 మంది హీరోలను కోల్పోయం. అందులో పౌరులు, మిలిటరీ సిబ్బంది ఉన్నారు’ అని జెలెన్స్కి తెలిపారు. మరో 316 మంది గాయపడ్డారని చెప్పారు. కేవలం మిలిటరీ స్థావరాలను మాత్రమే లక్ష్యం చేసుకున్నామని రష్యా ప్రకటించింది, అయితే దానికి విరుద్ధంగా ప్రజావాసాలపై కూడా దాడి చేస్తున్నదని చెప్పారు. శాంతియుతంగా ఉన్న పట్టణాలను కూడా సైన్యం లక్ష్యంగా చేసుకున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది ఎప్పటికీ క్షమించరానిదన్నారు. రష్యాను సమర్ధంగా ఎదురుకోవడానికి పూర్తిస్థాయిలో సైనికులను మోహరించాలని జెలెన్స్కీ ఆదేశించారు.
కాగా, ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు సమీపంలో ఉన్న చెర్నోబిల్ అణువిద్యుత్ కేంద్రాన్ని ఆక్రమించుకున్న రష్యా సైన్యం.. కీవ్వైపు వేగంగా ముందుకు కదులుతున్నారు. రాజధానికి సమీపంలో ఉన్న విమానాశ్రయాన్ని తమ ఆధీనంలోకి సుకున్నది. ఏ క్షణమైనా కీవ్‌ను స్వాధీనం చేసుకునే అవకాశం ఉన్నది.