మాస్కో : ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు తాత్కాలికంగా తెరపడిందని రష్యా తెలిపింది. ఈ ప్రక్రియను అడ్డుకుంటున్నది ఐరోపా దేశాలేనని ఆరోపించింది. చర్చలకు తాము సుముఖంగా ఉన్నామని స్పష్టం చేసింది.
క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ మీడియాతో మాట్లాడుతూ, కమ్యూనికేషన్ చానళ్లు పని చేస్తున్నాయని, వాటి ద్వారా తమ రాయబారులు చర్చలు జరిపే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.