కీవ్ : ఉక్రెయిన్పై రష్యా శనివారం అర్ధరాత్రి డ్రోన్లతో విరుచుకుపడింది. 2022లో యుద్ధం మొదలైన తర్వాత రష్యా జరిపిన అతిపెద్ద డ్రోన్ దాడుల్లో ఇది ఒకటి. రష్యా మొత్తం 273 డ్రోన్లు ప్రయోగించిందని, వాటిలో 88 డ్రోన్లను అడ్డుకున్నామని ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. కీవ్, డ్నిప్రొపెట్రోవ్స్క్, డొనెట్స్ ప్రాంతాల లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని వెల్లడించింది. ఈ దాడుల్లో ఒక యువతి మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారని కీవ్ ప్రాంతీయ గవర్నర్ తెలిపారు.
ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణపై శుక్రవారం జరిగిన ప్రత్యక్ష చర్చలు విఫలమైన తర్వాత ఈ దాడి జరగడం గమనార్హం. మరోవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి ఇరు దేశాల అధ్యక్షులతో పాటు, నాటో దేశాల అధినేతలతో సోమవారం మాట్లాడటానికి ప్లాన్ చేసుకొంటానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు.