కీవ్: ఉక్రెయిన్పై భారీ స్థాయిలో అటాక్ చేసింది రష్యా. సుమారు వెయ్యి డ్రోన్ల(Russia Drones)తో ఉక్రెయిన్పై విరుచుకుపడింది. ఇటీవల కాలంలో రష్యా చేసిన అతిపెద్ద దాడి ఇదే. గడిచిన 24 గంటల్లో సుమారు వెయ్యి డ్రోన్లతో రష్యా అటాక్ చేసినట్లు ఉక్రెయిన్ మిలిటరీ పేర్కొన్నది. పగటిపూటే దాదాపు 550 డ్రోన్లను ఫైర్ చేసినట్లు ఉక్రెయిన్ ఆరోపించింది. ఈ దాడుల వల్ల సుమారు 40 మంది గాయపడ్డారు. దీంట్లో అయిదుగురు చిన్నారులు ఉన్నట్లు అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. సిటీ సెంటర్లు, రెసిడెన్షియల్ బిల్డింగ్లను రష్యా టార్గెట్ చేసినట్లు ఉక్రెయిన్ చెప్పింది.
పశ్చిమ నగరం లివివ్పై భీకరంగా డ్రోన్ల దాడి జరిగింది. ఆ సిటీలో ఉన్న 16వ శతాబ్ధం నాటి బెర్నార్డైన్ మఠంపై దాడి జరిగింది. దీంతో యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడం దెబ్బతిన్నది. లివివ్ సమీపంలోని ఇవానో ఫ్రాంకీవిస్క్ ప్రాంతంలో ఉన్న ఓ మిలిటరీ ఆస్పత్రిపై కూడా దాడి జరిగింది. రష్యా జరిపిన దాడి చూస్తే ఆ దేశానికి యుద్ధం ముగించాలన్న ఆలోచన లేదన్నట్లు కనిపిస్తోందని జెలెన్స్కీ అన్నారు.
తాజా దాడుల గురించి ఇప్పటి వరకు రష్యా అధికారిక ప్రకటన చేయలేదు. లివివ్ నగరంపై డ్రోన్లు సంచరిస్తున్న వీడియోలు ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. ఆ నగరంలో 32 మంది గాయపడ్డారు.
🚨 WILD FOOTAGE! Watch the moment a Russian drone makes impact in the center of Lviv.
— Breaking911 (@Breaking911) March 24, 2026