మాస్కో: రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీపై రష్యా విజయాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న 80వ వార్షికోత్సవాలకు హాజరుకావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని రష్యా ఆహ్వానించింది.
వచ్చే నెల 9న మాస్కోలో ఈ ఉత్సవాలు జరుగుతాయి. మోదీతోపాటు వివిధ మిత్ర దేశాల అధినేతలను ఈ వేడుకలకు రష్యా ఆహ్వానించింది. 1945 జనవరిలో జర్మనీపై రష్యా దాడి ప్రారంభమైంది. జర్మనీ మే 9న లొంగిపోవడంతో యుద్ధం ముగిసింది.