Britain | రష్యా నుంచే మాకు తక్షణ ముప్పు.. వ్యూహాత్మక రక్షణ సమీక్షలో యూకే
Britain | బ్రిటన్ ప్రభుత్వం (Britain govt) తమ దేశ వ్యూహాత్మక రక్షణ సమీక్ష (Defence Review) ను సోమవారం ప్రకటించనుంది. ఈ మేరకు 130 పేజీల రక్షణ నివేదికను రూపొందించింది.
Britain : బ్రిటన్ ప్రభుత్వం (Britain govt) తమ దేశ వ్యూహాత్మక రక్షణ సమీక్ష (Defence Review) ను సోమవారం ప్రకటించనుంది. ఈ మేరకు 130 పేజీల రక్షణ నివేదికను రూపొందించింది. ప్రస్తుతం యూకే నూతన యుగంలోకి ప్రవేశిస్తోందని, ప్రపంచ దేశాల నుంచి బ్రిటన్‌కు భారీ ముప్పు పొంచి ఉందని ఆ నివేదికలో పేర్కొంది. రష్యా (Russia) ను తమ దేశానికి తక్షణ ముప్పుగా నివేదికలో యూకే పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న సైబర్ దాడులు, రహస్య కార్యకలాపాలను పరీక్షించిన తర్వాత రష్యాను తమకు తీవ్రమైన ముప్పుగా పరిగణించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. యూకే, యూరప్ రెండింటికీ రష్యా ప్రత్యక్ష ముప్పు ఎలా కలిగిస్తుందో రక్షణ నివేదికలో వివరించినట్లు తెలిపాయి. ఇక చైనా (China) ను అధునాతన, నిరంతర సవాళ్లను సృష్టించే దేశంగా అందులో పేర్కొన్నారు. ప్రపంచంపై పెరుగుతున్న చైనా ప్రభావం, రష్యాతో దాని సహకారంవల్ల ఆ దేశాన్ని నిరంతరం సవాళ్లు సృష్టించే దేశంగా నివేదిక తెలిపింది.
మొత్తం 130 పేజీలున్న రక్షణ నివేదికను యూకే ప్రధాని కీర్ స్టార్మర్ సలహాదారులు తయారు చేశారు. యూకే మాజీ లేబర్ డిఫెన్స్ సెక్రెటరీ, నాటో (NATO) సెక్రెటరీ జనరల్ లార్డ్ రాబర్ట్సన్ దీనికి నేతృత్వం వహించారు. ప్రపంచ దేశాల నుంచి తమకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో దేశంలో సైనిక దళాలు, అత్యాధునిక క్షిపణులు, ఆయుధాల తయారీ పెంచాల్సిన అవసరాన్ని సమీక్షిస్తున్నట్లు బ్రిటన్ ప్రభుత్వ అధికారులు ఆ నివేదికలో పేర్కొన్నారు.
Read More >>
France violence | ఫ్రాన్స్‌లో పీఎస్జీ విజయోత్సవాలు.. చెలరేగిన హింస.. 192 మందికి గాయాలు
Israel attacks | గాజాపై ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం.. 36 మంది పాలస్తీనియన్లు మృతి
Viral news | ప్రియుడికి లాటరీలో రూ.30 కోట్లు.. ఆ డబ్బు తీసుకుని మరో వ్యక్తితో ప్రియురాలు పరార్..!
Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని హసీనాపై మరో నేరాభియోగం
NIA raids | ఎనిమిది రాష్ట్రాలు.. 15 ప్రాంతాలు.. ఏకకాలంలో NIA తనిఖీలు
Sharmistha Panoli | ఆమె అరెస్ట్ సరికాదు.. విడుదల చేయండి.. ప్రధాని మోదీకి డచ్ ఎంపీ వినతి
Jyoti Malhotra | యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేరళ టూర్‌కు సీఎం అల్లుడే స్పాన్సర్..!
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

