వాషింగ్టన్: ఉక్రెయిన్‌లో రసాయనిక లేదా జీవాయుధ దాడికి రష్యా ప్లాన్ చేస్తున్నట్లు అమెరికా ఆరోపించింది. దీనిపై శ్వేతసౌధం ఓ ప్రకటన చేసింది. ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి మీడియాతో మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌లో అమెరికాకు జీవాయుధాలు ఉన్నట్లు రష్యా చేస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు.
రసాయనిక, జీవాయుధ దాడి చేసేందుకు రష్యా పన్నాగం వేసినట్లు జెన్ సాకి ఆరోపించారు. రష్యా సాంప్రదాయేతర ఆయుధాలను వినియోగించే అవకాశాలు ఉన్నట్లు వైట్‌హౌజ్ పేర్కొన్నది. సాధ్యమైనంత వరకు రసాయనిక ఆయుధాలు వాడుతుందని, లేదంటే చిన్న తరహా అణ్వాయుధం లేదా జీవాయుధాన్ని వాడే ప్రమాదం ఉందని వైట్‌హౌజ్ చెప్పింది. ఇది ఆందోళనకరమన్నారు.