మాస్కో: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్రధానులపై రష్యా (Russia) నిషేధం విధించింది. తమ దేశంలోకి వారిని అనుమతించేది లేదని స్పష్టం చేసింది. ప్రధానులే కాదు ఆ రెండు దేశాలకు చెందిన పలువురు మంత్రులు, ఎంపీలు కూడా తమ దేశంలోకి ప్రవేశించడానికి వీళ్లేదని ప్రకటించింది. ఉక్రెయిన్‌పై దాడికి దిగిన రష్యాపై ఆస్ట్రేలియా, న్యూజిలాడ్ ఆంక్షలు విధించాయి. దీంతో ప్రతిచర్యగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది.
ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, న్యూజిలాండ్ పీఎం జెసిండా ఆర్డెర్న్‌లు తమ దేశంలో ప్రవేశించడానికి వేళ్లేదని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వీరితోపాటు ఆస్ట్రేలియాకు చెందిన మంత్రులు, పార్లమెంటేరియన్లు 228 మంది, న్యూజిలాండ్‌కు చెందని 130 మందితో కూడిన నిషేధితుల జాబితాను విడుదల చేసింది. త్వరలో ఆస్ట్రేలియన్ మిలిటరీ, వ్యాపారవేత్తలు, నిపుణులు, రష్యాకు వ్యతిరేకంగా ఉండే జర్నలిస్టులను కూడా బ్లాక్‌లిస్ట్‌లో చేర్చుతామని వెల్లడించింది.