ఉక్రెయిన్‌పై 800 డ్రోన్లతో విరుచుకుపడ్డ రష్యా
ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడింది. 800 డ్రోన్లు, 13 క్షిపణులతో సెంట్రల్ కీవ్‌లో మంత్రులు నివసించే క్యాబినెట్ భవనంతో పాటు పలు నగరాలు, పట్టణాలపై వైమానిక దాడికి దిగింది.
- రష్యా చమురు పైపులైన్ ధ్వంసం చేసిన ఉక్రెయిన్
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడింది. 800 డ్రోన్లు, 13 క్షిపణులతో సెంట్రల్ కీవ్‌లో మంత్రులు నివసించే క్యాబినెట్ భవనంతో పాటు పలు నగరాలు, పట్టణాలపై వైమానిక దాడికి దిగింది. తొలుత రష్యా వాయుసేన సెంట్రల్ కీవ్‌లో మంత్రులు నివసించే భవనం లక్ష్యంగా దాడులు జరిపింది. ఈ దాడిలో ఏడాది చిన్నారి సహా ముగ్గురు మరణించారు. దీనికి ప్రతీకారంగా ఉక్రెయిన్.. రష్యాలో బ్రయాన్స్లోని డ్రుజ్బా చమురు పైపులైన్‌పై దాడి చేసింది. రెండు దేశాలు కూడా ప్రభుత్వ మౌలిక సదుపాయాలు లక్ష్యంగా దాడులు జరుపుకున్నాయి.
ఈ దాడిలో ఇతర ఉక్రెయిన్ నగరాలను కూడా రష్యా లక్ష్యంగా చేసుకుంది. క్రెమెన్‌చుక్‌లో డజన్ల కొద్దీ విద్యుత్ సౌకర్యాలు రష్యా దాడితో దెబ్బతిన్నాయి. అలాగే అధ్యక్షుడు జెలెన్స్కీ సొంత నగరమైన క్రివీరిహ్‌లో కూడా క్షిపణులు రవాణా, మౌలిక సదుపాయాలపై దాడులు జరిపాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా జరిపిన అతిపెద్ద గగనతల దాడుల్లో ఇదొకటి.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Drones attack
- Kyiv
- Russia
- Ukraine
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

