వాషింగ్టన్: నాటో గగనతలంలోకి రష్యా విమానాలు ప్రవేశించినట్టయితే వాటిని కూల్చివేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. మంగళవారం రాత్రి ఆయనను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కలిశారు. రష్యా ఆక్రమించిన ఉక్రెయిన్ భూ భాగాన్ని ఉక్రెయిన్ తిరిగి చేజిక్కించుకుంటుందన్న ఆశాభావాన్ని ఆయన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో వ్యక్తం చేశారు.
రష్యా ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడిలో ఉన్నందున ఐరోపా, నాటో సహకారంతో యుద్ధానికి ముందు ఉన్న సరిహద్దులను ఉక్రెయిన్ తిరిగి పొందుతుందని ఆయన పేర్కొన్నారు. రష్యాను ‘పేపర్ టైగర్’గా పేర్కొన్న ట్రంప్.. మూడున్నరేండ్లుగా యుద్ధంలో ఉన్నప్పటికీ రష్యా విజయం సాధించలేక పోయిందని అన్నారు.ట్రంప్ వ్యాఖ్యలకు రష్యా దీటుగా బదులిచ్చింది. రష్యా ‘బేర్’ అని, పేపర్ బేర్ ఉండదని స్పష్టంచేసింది.