శనివారం 16 జనవరి 2021
International - Dec 05, 2020 , 00:26:43

భారత్‌కు రూ.663 కోట్ల మిలిటరీ సామగ్రి

భారత్‌కు రూ.663 కోట్ల మిలిటరీ సామగ్రి

వాషింగ్టన్‌: రక్షణ రంగానికి సంబంధించి రూ.663 కోట్లు (90 మిలియన్‌ డాలర్లు) విలువచేసే సామగ్రిని భారత్‌కు విక్రయించడానికి అమెరికా ఆమోదం తెలిపింది. మిలిటరీ అవసరాల కోసం సీ-130జే రకం సూపర్‌ హెర్క్యులస్‌ రవాణా విమానాలను భారత వాయుసేన అమెరికా నుంచి కొనుగోలు చేసింది. ఆ విమానాల్లోని హార్డ్‌వేర్‌లో తలెత్తే చిన్నపాటి లోపాలకు మరమ్మత్తులు చేయడంతోపాటు విమానాలకు సర్వీసింగ్‌ చేయడానికి సామగ్రి కావాలని భారత్‌ అమెరికాకు ప్రతిపాదనలు పంపింది. దీనికి అమెరికా ఆమోదం తెలిపింది.