న్యూయార్క్: చంద్రుడు, ఇతర గ్రహాల ఉపరితలాలపై ఇబ్బందులు లేకుండా తిరిగేందుకు అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు సాసర్ను పోలిన ఓ ‘ఫ్లయింగ్ రోవర్’ను డిజైన్ చేశారు. విద్యుత్తు క్షేత్రం, సౌరశక్తి, వాతావరణంలోని ప్లాస్మాను ఆధారంగా చేసుకొని ఈ రోవర్లు ఒక మీటరు ఎత్తు వరకు ఎగురగలవు. స్థిర విద్యుత్తు క్షేత్రాన్ని కలుగజేస్తే వెంట్రుకలు నిటారుగా నిలబడుతాయనే సూత్రాన్నే దీనిలో ఉపయోగించనున్నట్టు పరిశోధకులు తెలిపారు.