బీజింగ్: రోబోలు ఇళ్లు, హోటళ్లలో సేవలందించడమే కాదు మారథాన్‌లో మనుషులతో పోటీ పడుతున్నాయి! చైనాలో ఇటీవల జరిగిన హాఫ్ మారథాన్‌లో ఈ కనువిందు చేసే దృశ్యాలు కనిపించాయి. బీజింగ్‌లో జరిగిన 21 కిలోమీటర్ల యిజువాంగ్ హాఫ్ మారథాన్‌లో వేలాది మంది మనుషులతోపాటు 21 రోబోలు పాల్గొన్నాయి.
చైనాలో గతంలోనూ మారథాన్లలో రోబోలు కనిపించినప్పటికీ, అవి మనుషులతోపాటు పరుగులు తీయడం ఇదే తొలిసారి.