Road accident : బొలీవియా (Bolivia) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. రెండు బస్సులు ఢీకొనడం వల్ల 37 మంది ప్రయాణికులు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో 39 మంది గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. బస్సుల్లో చిక్కుకున్న వారిని అతికష్టం మీద బయటకు తీసుకొచ్చారు. వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.
ప్రపంచ ప్రఖ్యాత ఉప్పు నేలల ప్రాంతమైన సలార్ డి ఉయూనికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఉరూరో ప్రాంతంలో జరుగుతున్న కార్నివాల్ వేడుకల్లో పాల్గొనేందుకు పలువురు ఓ బస్సులో వెళ్తుండగా, ఎదురుగా ప్రయాణికులతో వచ్చిన మరో బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్లు కూడా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.