Rishi Sunak | బ్రిటన్ తదుపరి రాజుగా కింగ్ చార్లెస్-3 (King Charles III) పట్టాభిషేకం (Coronation) ఈ నెల 6న లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ అబేలో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. రాజుగా చార్లెస్, రాణిగా కెమిల్లా కిరీట ధారణ చేశారు. ఈ కార్యక్రమానికి పలు దేశాధినేతలు, ప్రముఖులు హాజరయ్యారు.
కాగా, రాజు పట్టాభిషేకాన్ని పురస్కరించుకొని బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్ (Rishi Sunak), ఆయన భార్య అక్షతా మూర్తి (Akshata Murthy) ప్రత్యేక లంచ్ ఏర్పాటు చేశారు. ఆదివారం లండన్‌లోని డౌనింగ్‌స్ట్రీట్ (Downing Street ) లో ‘బిగ్ లంచ్’ (Big Lunch) పేరిట విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సతీమణి జిల్ బైడె (Jill Biden)న్ కూడా హాజరయ్యారు. పలువురు వ్యాపారవేత్తలు, ప్రముఖులను కూడా ఈ బిగ్ లంచ్‌కు ఆహ్వానించారు. ఈ ప్రత్యేక విందులో కప్‌కేక్స్, కేక్స్, శాండ్విచెస్ వంటి పలురకాల వంటకాలను అతిథుల వడ్డించారు.
Brilliant afternoon welcoming some incredible community heroes to Downing Street for our very own Coronation lunch.
The rain stayed away, the cakes were delicious and even Nova was on her best behaviour 🇬🇧
From our street to yours, hope you are enjoying a great day.… pic.twitter.com/1QQT9BKQXL
— Rishi Sunak (@RishiSunak) May 7, 2023
Cheers!
Thank you, Rishi and Akshata for welcoming me to your Coronation Big Lunch as we mark this special moment in history. pic.twitter.com/cQyNwHBeWD
— Jill Biden (@FLOTUS) May 7, 2023
Also Read..
Parineeti Chopra | త్వరలో ఎంపీతో నటి పెళ్లి.. మరోసారి డిన్నర్ డేట్‌కు వెళ్లిన పరిణీతి
Golden Temple | స్వర్ణదేవాలయం సమీపంలో మరో పేలుడు.. 24 గంటల్లో రెండోది
Virat Kohli | ఇదో అద్భుతం.. భూతద్దం సాయంతో కోహ్లీ రూపం.. వీడియో వైరల్