Virat Kohli | టీం ఇండియా (Team India) జట్టు మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విరాట్ (Virat Kohli) బ్యాట్ (Bat) పట్టాడంటే మైదనాంలో పరుగుల వరద పారాల్సిందే. తన ఆటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు ఈ రన్ మెషీన్. కాగా, తాజాగా కోహ్లీపై ఉన్న అభిమానాన్ని ఓ ఆర్టిస్ట్ సరికొత్త రీతిలో చాటుకున్నాడు.
విఘ్నేశ్ (Vignesh) అనే ఆర్టిస్ట్ అసాధారణ రీతిలో చెక్కపై కోహ్లీ చిత్రాన్ని చెక్కాడు. ఇందుకోసం అతను భూతద్దాన్ని ఉపయోగించడం విశేషం. భూతద్దం (magnifying glass) సాయంతో చెక్కపై సూర్యకిరణాలను కేంద్రీకరించి బోర్డు ఉపరితలం కాల్చి కోహ్లీ రూపాన్ని చిత్రీకరించాడు. ఇందుకు సంబంధించిన వీడియోని ఇండియన్ ఆర్టిస్ట్స్ క్లబ్ (Indian Artists Club) అనే ఇన్స్టాగ్రామ్ పేజ్‌లో పోస్టు చేయగా.. ప్రస్తుతం అదికాస్తా వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ‘వావ్.., సూపర్.., ఇదో అద్భుతం..’ అంటూ ఆర్టిస్ట్ పనితనాన్ని మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోకు ఇప్పటి వరకు 1.85 లక్షల వ్యూస్, 14 వేలకుపైగా లైక్స్ వచ్చాయి.
Also Read..
MiG 21 Aircraft Crashes | రాజస్థాన్‌లో కూలిన మిగ్-21 యుద్ధ విమానం.. ముగ్గురు మృతి
Texas Car Accident | టెక్సాస్‌లో ప్రమాదం.. ప్రయాణికులపైకి దూసుకెళ్లిన కారు.. ఏడుగురు మృతి
Peru Gold Mine Fire | బంగారు గనిలో ఘోర ప్రమాదం.. 27 మంది కార్మికులు మృతి