Parineeti Chopra | త్వరలో ఎంపీతో నటి పెళ్లి.. మరోసారి డిన్నర్ డేట్‌కు వెళ్లిన పరిణీతి
Parineeti Chopra | ఆప్ ఎంపీ (AAP MP) రాఘవ్ చద్దా (Raghav Chadha) , బాలీవుడ్ (Bollywood) స్టార్ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra) మరోసారి వార్తల్లో నిలిచారు. ఆదివారం రాత్రి ఈ ప్రేమ జంట ముంబై (Mumbai)లో డిన్నర్ డేట్ (Dinner Date) కు వెళ్లారు.
Parineeti Chopra | ఆప్ ఎంపీ (AAP MP) రాఘవ్ చద్దా (Raghav Chadha) , బాలీవుడ్ (Bollywood) స్టార్ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra) మరోసారి వార్తల్లో నిలిచారు. వీరిద్దరూ ప్రస్తుతం ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా నెట్టింట, పలు వెబ్సైట్లలో వరుస కథనాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. పెళ్లి వార్తల నడుమ వీరిద్దరూ మరోసారి జంటగా కనిపించారు. ఆదివారం రాత్రి ఈ ప్రేమ జంట ముంబై (Mumbai)లో డిన్నర్ డేట్ (Dinner Date) కు వెళ్లారు. వీరిని చూసిన మీడియా, అభిమానులు.. పెళ్లి గురించి ప్రశ్నించారు. అయితే, అందుకు ఇద్దరూ సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి నవ్వుతూ వెళ్లిపోయారు. రెస్టారెంట్ నుంచి ఇద్దరూ కలిసి బయటకు వస్తున్న ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
కాగా, గతకొంతకాలంగా వీరిద్దరూ కలిసి వరుసగా డిన్నర్ డేట్స్ (Dinner Dates), లంచ్ మీటింగ్స్ (Lunch Meets) అంటూ చట్టాపట్టాలేసుకు తిరుగుతున్నారు. అంతేకాకుండా ముంబైలో జరిగిన పలు కార్యక్రమాలకు కూడా జంటగా హాజరయ్యారు. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని తర్వలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. మరోవైపు ఈ ప్రేమ పక్షులు త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారంటూ వీరిద్దరికీ దగ్గరి వ్యక్తులు కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. మే 13వ తేదీన ఢిల్లీ (Delhi)లో వీరి నిశ్చితార్థ వేడుక జరగనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. నిశ్చితార్థానికి ముందు నిర్వహించే రోకా వేడుక పూర్తైందని.. ఈ ఏడాది అక్టోబర్ చివర్లో వీరు వివాహం చేసుకునే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. అయితే ఈ వార్తలపై పరిణీతి గానీ, రాఘవ్ చద్దా గానీ ఇప్పటి వరకూ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. పెళ్లి వార్తల్లో నిజం ఎంతన్నది మరి కొన్ని రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. అప్పటి వరకూ వేచి చూడాల్సిందే.
Parineeti Chopra and Raghav Chadha were snapped leaving a restaurant last night! #Pinkvilla #ParineetiChopra #RaghavChadha pic.twitter.com/cyj5FwRRR3
— Pinkvilla (@pinkvilla) May 8, 2023
ఇదిలా ఉండగా.. ఢిల్లీలో ఎంగేజ్మెంట్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. నిశ్చితార్థం కోసం పరిణీతి చోప్రా షూటింగ్స్‌ను వాయిదా వేసుకుందని సమాచారం. ప్రస్తుతం ఈ భామ హిందీలో ఛమ్కీలా, క్యాప్య్సుల్ గిల్ చిత్రాల్లో నటిస్తోంది. ఇక రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తరపున రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.
Also Read..
Golden Temple | స్వర్ణదేవాలయం సమీపంలో మరో పేలుడు.. 24 గంటల్లో రెండోది
Virat Kohli | ఇదో అద్భుతం.. భూతద్దం సాయంతో కోహ్లీ రూపం.. వీడియో వైరల్
MiG 21 Aircraft Crashes | రాజస్థాన్‌లో కూలిన మిగ్-21 యుద్ధ విమానం.. ముగ్గురు మృతి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

