Putins Secret Daughter | రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin)పై అతని రహస్య కుమార్తె (Putins Secret Daughter)గా చెప్పుకునే 22 ఏండ్ల ఎలిజవేటా క్రివోనోగిఖ్ (Elizaveta Krivonogikh) సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘అతను నా జీవితాన్ని నాశనం చేయడంతో పాటు లక్షలాది మందిని పొట్టన పెట్టుకున్నాడు’ అంటూ టెలిగ్రామ్ చానల్లో పోస్టు పెట్టారు. ‘నా ముఖాన్ని మళ్లీ ప్రపంచానికి చూపించడం అనేది నాకు విముక్తినిస్తుంది. నేను ఎవరో.. నా జీవితాన్ని ఎవరు నాశనం చేశారనేది నాకు గుర్తు చేస్తుంది’ అని రాసుకొచ్చారు. అయితే, ఆ పోస్ట్‌లో ఎవరి పేరూ ప్రస్తావించనప్పటికీ.. ఈ వ్యాఖ్యలు పుతిన్‌ని ఉద్దేశించే అని ప్రచారం జరుగుతోంది.
ఎలిజవేటా క్రివోనోగిఖ్ 2003లో సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జన్మించింది. పుతిన్, ఆయన మాజీ ఉద్యోగి స్వెత్లానా క్రివోనోగిఖ్కు జన్మించిన రహస్య కుమార్తెగా అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. ప్రస్తుతం ఎలిజవేతా పారిస్‌లో నివసిస్తోంది. స్వెత్లానా ఒకప్పుడు సాధారణ క్లీనింగ్ వర్కర్‌గా పనిచేసి, పుతిన్ అధికారంలోకి వచ్చాక అనూహ్యంగా రష్యన్ మిలియనీర్‌గా అవతరించారు. ఈ సంపద పుతిన్ ద్వారా పొందారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో 2020లో స్వెత్లానా క్రివోనోగిఖ్ ఆస్తులపై దర్యాప్తు చేసిన సమయంలో ఎలిజవేటా క్రివోనోగిఖ్.. పుతిన్ రహస్య కుమార్తె అని తేలినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
Also Read..
Chikungunya: చైనాలో చికున్‌గునియా వైరస్.. ఏడు వేల కేసులు నమోదు
Sports Visas | ఇకపై ట్రాన్స్‌జెండర్ మహిళలకు స్పోర్ట్స్ వీసాలపై నిషేధం.. ట్రంప్ సర్కార్ నిర్ణయం!
Earthquake | రష్యాలో మరోసారి భారీ భూకంపం.. కామ్చట్కా తీరంలో ప్రకంపణలు