Omicron | సెంచూరియన్: ఒమిక్రాన్ వేరియంట్ ( Omicron variant ) గురించి దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు కొంత స్టడీ చేశారు. ఆందోళనకరమైన ఈ వేరియంట్‌పై కొన్ని అంశాలను వెల్లడించారు. ఒమిక్రాన్‌తో రీఇన్ఫెక్షన్కు అధిక అవకాశాలు ఉన్నట్లు తేల్చారు. డెల్టా లేదా బీటా స్ట్రెయిన్ వైరస్‌లతో పోలిస్తే.. కరోనా ఒమిక్రాన్ వేరియంట్ వల్ల ఇన్ఫెక్షన్లు మూడు రెట్లు అధికంగా ఉన్నట్లు దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఆ దేశానికి చెందిన ఆరోగ్యశాఖ సేకరించిన డేటా ఆధారంగా ఈ విషయాన్ని తేల్చారు. దీనికి సంబందించిన రిపోర్ట్‌ను మెడికల్ జర్నల్‌లో అప్లోడ్ చేశారు. అయితే నిపుణులు ఈ నివేదికను పరిశీలించాల్సి ఉంది. సుమారు 28 లక్షల మంది పాజిటివ్ తేలగా.. వారిలో 35,670 మందికి రీఇన్ఫెక్షన్ వచ్చినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. 90 రోజుల వ్యవధి తర్వాత మళ్లీ పరీక్ష చేస్తే, అప్పుడు పాజిటివ్ వస్తే ఆ కేసుల్ని రీఇన్‌ఫెక్షన్లుగా భావిస్తారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Omicron | దేశంలోకి ఎంటరైన ఒమిక్రాన్.. అక్కడే రెండు కేసులు: కేంద్రం
New Omicron Cases: దక్షిణాఫ్రికాలో ఒక్క రోజులో.. రెట్టింపు ఒమిక్రాన్ కేసులు
Omicron | ఎప్పటికప్పుడు రూపం మార్చుకుంటున్న కరోనా వైరస్ నుంచి బయటపడగలమా?
కరోనా కొత్త వేరియంట్‌కు ఒమిక్రాన్ అనే ఎందుకు పేరు పెట్టారు? దీనికి చైనా అధ్యక్షుడికి సంబంధమేంటి?
ఒమిక్రాన్ భయం.. బూస్టర్ డోస్ వేసుకోవాలా? ఇది కరోనా కొత్త వేరియంట్ నుంచి రక్షిస్తుందా?
Omicron | ఒమిక్రాన్ అంత ప్రమాదకరమైనదా? దీన్ని చూసి ప్రపంచ దేశాలు ఎందుకు భయపడుతున్నాయి?