బుధవారం 08 జూలై 2020
International - Jun 30, 2020 , 11:38:15

థ్యాంక్యూ ఇండియ‌న్ ఆర్మీ.. టిబెట‌న్ల నిర‌స‌న ..వీడియో

థ్యాంక్యూ ఇండియ‌న్ ఆర్మీ.. టిబెట‌న్ల నిర‌స‌న ..వీడియో

న్యూఢిల్లీ: భారత్‌-చైనా స‌రిహ‌ద్దుల్లో చైనా సైనికుల దుశ్చ‌ర్య‌పై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మవుతున్నాయి. అంత‌ర్జాతీయ స‌మాజంతోపాటు చైనా ప్ర‌జ‌లు కూడా త‌మ‌ సైన్యం తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా కెన‌డాలోనూ టిబెటన్లు చైనాకు వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌కు దిగారు. టొరంటోలోని చైనా రాయ‌బార కార్యాల‌యం ముందు రీజిన‌ల్‌ టిబెట‌న్ యూత్ కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేట్టారు. ఈ సంద‌ర్భంగా వారు చైనా తీరుపై మండిప‌డ్డారు. 

చైనా రాయ‌బార కార్యాల‌యం ముందే చైనాకు వ్య‌తిరేకంగా, భార‌త్‌కు అనుకూలంగా నినాదాల‌తో హోరెత్తించారు. టిబెట్ స్టాండ్స్ విత్ ఇండియా, థ్యాంక్యూ ఇండియ‌న్ ఆర్మీ అంటూ నినాదాలు చేశారు. కాగా, టిబెట‌న్ యూత్ కాంగ్రెస్ స‌భ్యులు కెనడాలోనేగాక అమెరికాలోని న్యూయార్క్‌, న్యూజెర్సీ రాష్ట్రాల్లోనూ చైనా వ్య‌తిరేక ఆందోళ‌న‌లు నిర్వ‌హించారు. కాగా, జూన్ 15, 16 తేదీల్లో భార‌త్-చైనా సైనికుల మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల్లో 20 మంది భార‌త సైనికులు వీర‌మ‌ర‌ణం పొందారు.


logo