e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home అంతర్జాతీయం వెయ్యేండ్ల రికార్డు వానలు

వెయ్యేండ్ల రికార్డు వానలు

వెయ్యేండ్ల రికార్డు వానలు

చైనాను ముంచెత్తుతున్న భారీ వర్షాలు
బీజింగ్‌, జూలై 21: చైనాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. హెనన్‌ ప్రావిన్స్‌లో గత వెయ్యేండ్లలో లేనంత రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ప్రావిన్స్‌ రాజధాని జెంగ్‌జౌలో మంగళవారం ఒక్కరోజే 45.7 సెంటీమీటర్ల వాన పడింది. ప్రావిన్స్‌లో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. భీకర వరదలు సంభవించాయి. రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. కార్లు కాగితపు పడవల్లా వరదల్లో కొట్టుకుపోతున్నాయి. వరదల కారణంగా 25 మంది చనిపోయారు. ఏడుగురు గల్లంతయ్యారు. ఓ రైల్వే టన్నెల్‌లో భారీగా నీరు చేరడంతో రైలు ప్రయాణికులతో అందులోనే ఇరుక్కుపోయింది. రైల్లో ప్రయాణికుల మెడల వరకు నీరు చేరిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. ఇందులో 12 మంది చనిపోయారు. 500 మందికి పైగా ప్రయాణికులను రక్షించారు. సహాయకార్యక్రమాల కోసం బుధవారం సైన్యం రంగంలోకి దిగింది. ఈ భారీ వర్షాల ప్రభావం 12.4 లక్షల మందిపై పడింది. ఇప్పటివరకు 1.60 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రవాణా నిలిచిపోయింది. 250కి పైగా విమాన సర్వీసులను రద్దు చేశారు. యిచువాన్‌ కౌంటీలో భారీ వరద నీటిని దారి మళ్లించడానికి సైన్యం ఓ పాడుబడ్డ డ్యామ్‌ను పేల్చేసింది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వెయ్యేండ్ల రికార్డు వానలు
వెయ్యేండ్ల రికార్డు వానలు
వెయ్యేండ్ల రికార్డు వానలు

ట్రెండింగ్‌

Advertisement