మాస్కో: రష్యాలో మంగళవారం రికార్డుస్థాయిలో కరోనా మరణాలు సంభవించాయి. ఒక్కరోజులోనే 973 మంది ప్రాణాలు కోల్పోయారు. రష్యాలో కరోనా వెలుగుచూసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కరోజులో ఇంత మంది మరణించడం ఇదే తొలిసారి. అంతేకాదు.. యూరప్‌లోనే అత్యధిక కరోనా మరణాలు నమోదైన దేశంగా రష్యా రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు 2,18,345 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.