బీజింగ్, అక్టోబర్ 13: చైనా కమ్యూనిస్టు పార్టీ సమావేశాలు కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ దేశంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకొన్నది. గురువారం ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను, ఆయన విధానాలను నిరసిస్తూ ఆందోళనకారులు బీజింగ్‌లో ధర్నాలు చేపట్టారు.
నియంత జిన్‌పింగ్‌ను తొలగించాలి అంటూ నినాదాలు చేశారు. చైనాలో ఉన్నత స్థాయి నేతలు, అదీ.. అధ్యక్షుడికి వ్యతిరేకంగా నిరసన చేపట్టడం అరుదు. అలాంటిది సీపీసీ సమావేశాల ముందు ఈ ధర్నా షాక్‌కు గురిచేస్తున్నది.