సిడ్ని: ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో భూకంపం వచ్చింది. మెల్బోర్న్లో బుధవారం ఉదయం 9 గంటలకు (ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం) భూమికంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.9గా నమోదయిందని యూఎస్ జియోలాజికల్ సర్వే సంస్థ ప్రకటిచింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని తెలిపింది. దీంతో భవనాలు ఊగిపోయాయి. పలు బిల్డింగుల గోడలు కూలిపడ్డాయి. దీంతో ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు. మెల్బోర్న్లోని ప్రముఖ వాణిజ్య కేంద్రమైన చాపెల్ స్ట్రీట్లో రోడ్లపై గోడలు కూలి ఇటుకలు చెల్లాచెదురుగా పడ్డాయి. కాగా, భూకంపం వల్ల ప్రాణ నష్టం గానీ, ప్రజలు గాయపడినట్లు గానీ ఎలాంటి సమాచారం అందలేదని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ తెలిపారు.