బీజింగ్ : రామాయణ కావ్యం ఆధారంగా రచించిన ‘ఆది కావ్య-ద ఫస్ట్ పోయమ్’ పేరుతో చైనాలో ఒక నృత్య నాటకాన్ని ప్రదర్శించారు. భారత దౌత్య కార్యాలయంలో శనివారం జరిగిన ఈ ప్రదర్శనలో 50 మందికి పైగా ప్రతిభావంతులైన నృత్యకారులు పాల్గొన్నారు.
చైనా తత్వవేత్త దివంగత ప్రొఫెసర్ జియాన్లిన్ అనువదించిన ఈ నృత్య నాటకానికి చైనా భరతనాట్య ప్రతినిధి జిన్ శాంసన్ దర్శకత్వం వహించారు. చైనాలో ఈ నృత్యనాటకాన్ని ప్రదర్శించడం ఇది రెండోసారి.