దుబాయ్, జూన్ 22: అమెరికా దాడుల వల్ల తమ అణు కేంద్రాల నుంచి రేడియోధార్మికత లీకేజ్ అన్నది ఎక్కడా లేదని ఇరాన్ ప్రకటించింది. ఇస్ఫాహన్, ఫోర్డో, నతాంజ్‌లలోని అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని అమెరికా గగనతల దాడులు జరిపిందని, అయితే రేడియోధార్మికత వెలువడినట్టు రేడియేషన్ డిటెక్టర్స్ నమోదు చేయలేదని ఇరాన్‌కు చెందిన ‘నేషన్ న్యూక్లియర్ సేఫ్టీ సిస్టం సెంటర్’ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. అణు కేంద్రాల పరిసర ప్రాంతాల్లో నివసించేవారికి ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేసింది.