మాస్కో: ఉక్రెయిన్‌కు మద్దతుగా ఆ దేశంలో తమ దళాలను మోహరించే దేశాలను లక్ష్యంగా చేసుకుంటామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు. ఉక్రెయిన్‌తో జరుగుతున్న ఈ యుద్ధ సమయంలో తమకు వ్యతిరేకంగా నిలిచే దేశాలను చట్టబద్ధమైన లక్ష్యాలుగా చేసుకునే అధికారం తమకు ఉంటుందన్నారు. ఇప్పటికీ మాస్కోలో శాంతి చర్చలు నిర్వహించేందుకు సిద్ధమని ప్రతిపాదించారు.
వ్లాడివోస్తోక్‌లో జరిగిన ఆర్థిక వేదిక కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌లో విదేశీ దళాల మోహరింపును రష్యా తన జాతీయ భద్రతకు ప్రత్యక్ష ముప్పుగా పేర్కొంటూ వస్తోంది. రష్యా ఏదైనా ఒప్పందాన్ని పూర్తిగా పాటిస్తుందని అన్నారు. 26 దేశాల ఐరోపా నేతలు బుధవారం పారిస్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సమావేశమైన నేపథ్యంలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.