కాట్మాండూ, నవంబర్ 20 : నేపాల్లో మరోసారి జెన్ జీ ఆందోళనలు ప్రారంభమయ్యాయి. బారా జిల్లాలో జెన్ జీ ఆందోళనకారులు రెండో రోజైన గురువారం కూడా వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేయడంతో పలు చోట్ల పోలీసులతో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇటీవలి జెన్ జీ నిరసనలు కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని నేపాల్ ప్రభుత్వాన్ని గద్దె దించిన విషయం తెలిసిందే.
బుధవారం యువతకు సీపీఎన్-యూఎంఎల్ మద్దతుదారుల మధ్య ఘర్షణలు జరిగాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 8 గంటల వరకు కర్ఫ్యూ విధించారు.