న్యూఢిల్లీ : పాకిస్థాన్ ఆర్మీ ఫీల్డ్ మార్షల్ సయ్యద్ అసిం మునీర్‌కు అమెరికాలో నిరసన సెగ తగిలింది. ఐదు రోజుల పర్యటన నిమిత్తం వాషింగ్టన్ వెళ్లిన మునీర్‌కు సొంత దేశీయుల నుంచే వ్యతిరేకత వ్యక్తమయింది. మునీర్ బస చేసే హోటల్ ముందు నిరసనకారులు ‘నువ్వొక సామూహిక హంతకుడివి, నియంతవు, నీ ప్రవర్తనకు సిగ్గుపడు, నీ సమయం ముగిసింది…
పాకిస్థాన్ పురోగతి చెందుతుంది.. తుపాకులు మాట్లాడితే ప్రజాస్వామ్యం పతనమవుతుంది’ అని పేర్కొంటూ డిజిటల్ బోర్డులతో ప్రదర్శన నిర్వహించారు. మునీర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసనకారులను పోలీసులు అడ్డుకునేందుకు యత్నించారు.