G7 Summit : దేశ ప్రధానిగా ఇటీవల వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ తొలి విదేశీ పర్యటనకు శ్రీకారం చుట్టారు. జీ7 సదస్సులో పాల్గొనేందుకు గురువారం సాయంత్రం మోదీ ఇటలీలోని అపులియ బయలుదేరారు.
జీ7 సదస్సు సందర్భంగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో మోదీ ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఇక జీ7 50వ సదస్సులో పాల్గొనేందుకు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా, జర్మనీ, జపాన్ దేశాధినేతలు ఇటలీకి చేరుకున్నారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని వారికి ఘనస్వాగతం పలికారు.
Read More :
DSC | డీఎస్సీ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఎడిట్ ఆప్షన్ అవకాశం ఇచ్చిన విద్యాశాఖ