టెహ్రాన్, మే 21: అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63)మృతితో ఇరాన్ అంతటా విషాదఛాయలు అలుమున్నాయి. ఇరాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 5 రోజులపాటు సంతాపదినాల్ని ప్రకటించింది. మంగళవారం వివిధ నగరాల్లోని కూడళ్ల వద్దకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చి..ఆయన మృతికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. నిజాయితీ గల విలువైన సేవకుడ్ని ఇరాన్ కోల్పోయిందని సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ అన్నారు. జూన్ 28న అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయని ఇరాన్ అధికారిక మీడియా మంగళవారం తెలిపింది.