వాషింగ్టన్ : అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం అద్భుతంగా ఉందని ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చెప్పారు. ‘యూఎస్ఏ టుడే’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వాన్స్ మాట్లాడుతూ, ట్రంప్ అలుపెరుగని నేత అని చెప్పారు. ట్రంప్ అర్ధరాత్రి దాటే వరకు పని చేస్తారని, తెల్లవారుజామునే మళ్లీ పనిలోకి దిగుతారని తెలిపారు. ట్రంప్ తన పదవీ కాలం పూర్తయ్యే వరకు దేశాధ్యక్షుడిగా సేవలందిస్తారని, అమెరికా ప్రజల కోసం గొప్ప పనులు చేస్తారని చెప్పారు.
అవసరమైతే దేశాధ్యక్ష పదవిని చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారా? అని అడిగినపుడు వాన్స్ బదులిస్తూ,200 రోజుల్లో ఉపాధ్యక్ష పదవిలో తాను పొందిన అనుభవం తనను బాధ్యత తీసుకోవడానికి సిద్ధం చేసిందన్నారు. ద.కొరియా అధ్యక్షుడితో వైట్ హౌస్లో జరిగిన భేటిలో ట్రంప్ చేతి మీద కమిలినట్లు కనిపించింది. దీంతో ఆయన ఆరోగ్యంపై చర్చ జరుగుతున్నది.