వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి తాను మూడోసారి పోటీ చేసే అవకాశం లేకపోలేదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఆ ప్రతిపాదనను తాను ఇష్టపడుతున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. సోమవారం తన ఆసియా పర్యటనలో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ 2028లో ఉపాధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేసే అవకాశాన్ని తోసిపుచ్చారు.
అమెరికా అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు పనిచేసిన వ్యక్తి అధ్యక్ష పదవికి మూడవ పర్యాయం పోటీ చేసేందుకు అమెరికా రాజ్యాంగం అంగీకరించదు. దీన్ని అధిగమించడానికి ఉపాధ్యక్ష ఎన్నికల్లో పోటీచేయాలని తన మద్దతుదారులు చేసిన సూచనను ట్రంప్ తిరస్కరించారు. ఇది తనకు తగదని ట్రంప్ వ్యాఖ్యానించారు.