వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాను టోర్నడో (tornado) వణికిస్తున్నది. దేశంలోని రాష్ట్రాలు, కౌంటీలు టోర్నడోతో అల్లకల్లోలంగా మారాయి. సోమ, మంగళవారాల్లో తీవ్రత మరింత పెరుగుతుందని నిపుణులు హెచ్చరించారు. మూడు నాలుగు రోజుల్లో కాలిఫోర్నియాను తాకుతుందని చెప్పారు.
గత వందేండ్లలో ఎన్నడూ లేనిస్థాయిలో నేలపై కొనసాగినట్లు అంచనా వేస్తున్నారు. వేడి వాతావరణం కూడా టోర్నడోకు కారణమని శాస్త్రవేత్తలు ప్రకటించారు.
కాగా, టోర్నడో కారణంగా ఇప్పటికే వంద మందికిపైగా మృతిచెందారు. ఒక్క కెంటకీలోనే సుమారు 80 మంది మరణించారని అధికారులు తెలిపారు.
అధ్యక్షుడు జో బైడెన్ ప్రకృతి విపత్తుపై సమీక్ష నిర్వహించారు. బాధితులను ఆదుకుంటామని ప్రకటించారు. అమెరికా చరిత్రలో ఇదే అతిపెద్ద టోర్నడో అని చెప్పారు.
Before/After of Graves County Courthouse in Mayfield, KY. #kywx pic.twitter.com/mWIphPrvIN
— Scott McClellan (@ALAWXChase) December 11, 2021