న్యూయార్క్: భారత్లో పేదరికం తగ్గినట్లు ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించింది. 2011-12 నుంచి 2022-23 మధ్య కాలంలో 17.1 కోట్ల మంది కడు పేదరికం నుంచి బయటపడినట్లు తెలిపింది. రోజుకు రూ.183 కన్నా తక్కువ సంపాదించేవారు 2011-12లో 16.2 శాతం మంది ఉండేవారని, 2022-23 నాటికి వీరు 2.3 శాతానికి తగ్గిపోయారని చెప్పింది.
‘పావర్టీ అండ్ ఈక్విటీ బ్రీఫ్ ఆన్ ఇండియా’ నివేదికలో ఈ వివరాలను తెలిపింది. గ్రామీణ కడు పేదరికం 18.4 శాతం నుంచి 2.8 శాతానికి తగ్గిందని, పట్టణాల్లో 10.7 శాతం నుంచి 1.1 శాతానికి తగ్గిందని వివరించింది. భారత్ దిగువ మధ్య ఆదాయ వర్గంలోకి మారిందని పేర్కొన్నది.