గడ్డకట్టిన నదిపై నడవాలంటే ఎలా? అనే విషయం మనమంతా చిన్నతనంలో స్కూల్లో చదువుకునే ఉంటాం. పల్చటి మంచు పొరపై నిలబడితే అది పగిలిపోతుందని, అందుకే దానిపై పడుకోవాలని సైన్స్ పుస్తకాల్లో చెప్తారు. అలా చేస్తే మన శరీరం బరువు ఒకే ప్రాంతంపై పడకుండా.. మంచు పొరపై డిస్ట్రిబ్యూట్ అవుతుంది. తద్వారా మంచిపై తీవ్రత తగ్గి అది పగలదు.
ఈ విషయాన్ని జంతువులకు ఎవరు నేర్పిస్తారు? వాటికి స్కూల్స్ ఉండవు కదా. కానీ ఒక ఎలుగు బంటి ఈ సైన్స్ పాఠం విన్నట్లుంది. అందుకే గడ్డకట్టిన నీటిపై వెళ్లేటప్పుడు తెలివిగా పడుకొని జారుకుంటూ వెళ్లిపోయింది. ఈ వీడియోని ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ధ్రువపు ఎలుగుబంటి నేర్పుతున్న జీవితపాఠం అంటూ ఆమె దీనికి క్యాప్షన్ తగిలించారు.
‘పల్చటి మంచు పొర పగలకుండా దాన్ని దాటడం ఎలా? జీవితంలో కూడా అంతే.. ధ్రువపు ఎలుగుబంటి చెప్తోన్న జీవిత గుణపాఠం’ అని ఆమె పోస్టు చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కొందరు ఈ ఎలుగు తెలివితేటలకు ముచ్చటపడిపోతుంటే.. మరికొందరు ఇదేదో సైంటిస్ట్ ఎలుగుబంటిలా ఉందంటూ జోకులు చేస్తున్నారు. అసలు మంచు పొరను ఇలా దాటాలని దానికి ఎవరు నేర్పించారో కదా? అని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
How to navigate through ice sheet without breaking it – ditto for life 😊 Life lesson from a Polar bear #FridayFeeling pic.twitter.com/kBmaD9GLr3
— Supriya Sahu IAS (@supriyasahuias) October 14, 2022