న్యూయార్క్: గత ఐదేండ్లలో మీ ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్/ఎక్స్ వంటి సోషల్ మీడియా ఖాతాల్లో ఏమున్నదో చూపించి ఆ తరువాతనే మా దేశంలోకి అడుగుపెట్టండి అని అమెరికా సరికొత్తగా మరో నిబంధనను ప్రతిపాదించేందుకు సిద్ధమైంది. ట్రంప్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత విదేశీయుల రాకపై పలు రకాల ఆంక్షలు విధిస్తున్న అమెరికా తాజాగా మరొక దానిని ప్రతిపాదించింది.
తమ దేశంలోకి వచ్చే విదేశీయులు తప్పనిసరిగా గత ఐదేండ్ల సోషల్మీడియా చరిత్రను తమకు అందజేయాలని పేర్కొంది. ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్, బ్రిటన్కు చెందిన పౌరులు వీసా లేకుండానే అమెరికాలో ప్రవేశించవచ్చు. అయితే వీరు కూడా తమ సోషల్ మీడియా ఖాతాలను అందుబాటులో ఉంచాల్సిందేనని అమెరికా కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ సంస్థ స్పష్టం చేసింది.