Operation Sagar Bandhu : ఇటీవల సంభవించిన దిత్వా తుఫాన్ (Ditwaj Cyclone) కారణంగా భారీగా ఆస్తి, ప్రాణ నష్టం చవిచూసిన శ్రీలంకకు భారత ప్రభుత్వం ఆపన్నహస్తం అందిస్తోంది. ఇప్పటికే సహాయక బృందాలను పంపిన భారత్ పొరుగు దేశానికి మరింత సాయం చేసేందుకు సిద్దమైంది. సోమవారం లంక అధ్యక్షుడు అరుణు కుమర్ దిస్సనాయకే (Anura Kumara Dissanayake)తో ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) ఫోన్లో మాట్లాడారు. ‘ఆపరేషన్ సాగర్ బంధు’ (Operation Sagar Bandhu) కింద శ్రీలంకకు మరింత సాయం అందిస్తామని మోడీ హామీ ఇచ్చారు. తుఫాన్ ధాటికి సంభవించిన వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు భారత ప్రధాని.
పొరుగు దేశమైన శ్రీలంకను చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఆ దేశంలో దిత్వా తుఫాన్ సృష్టించిన విలయం అంతాఇంతా కాదు. ఈ విపత్కర పరిస్థితుల్లో శ్రీలంకకు భారత ప్రభుత్వం అన్నివిధాలా సాయం చేస్తోంది. సోమవారం లంక అధ్యక్షుడు అరుణు కుమర్ దిస్సనాయకేతో ఫోన్లో మాట్లాడిన.. ప్రధాని నరేంద్ర మోడీ ఆ దేశంలోని తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆ దేశంలోని తుఫాన్ బాధితులకు పునరావాసం, ప్రజలకు నిత్యవసరాలు వంటివి సమకూర్చేందుకు భారత్ సిద్ధంగా ఉందని మోడీ ఈ సందర్భంగా దిస్సనాయకేకు స్పష్టం చేశారు.
Spoke with President Dissanayake and conveyed heartfelt condolences on the tragic loss of lives and the widespread devastation caused by Cyclone Ditwah. As a close and trusted friend, India stands firmly beside Sri Lanka and its people in this difficult hour.
India will continue…
— Narendra Modi (@narendramodi) December 1, 2025
అంతేకాదు ఈ కష్ట సమయంలో భారతీయులు లంకకు మద్దతుగా ఉంటారని ప్రధాని తెలియజేశారు. ఆపరేషన్ సాగర్ బంధు కింద సాయం చేస్తామని చెప్పిన మోడీకి లంక నాయకుడు దిస్సనాయకే కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల బీభత్సం సృష్టించిన దిత్వా తుఫాన్ ఇప్పటివరకూ శ్రీలంకలో 200 మందిని బలిగొన్నది.. వేలాదిమందిని నిరాశ్రయులను చేసింది. వరద గుప్పిట చిక్కుకున్న శ్రీలంక ప్రజలను కాపాడేందుకు భారత వాయుసేన వెంటనే రంగంలోకి దిగింది. కొండచరియలు విరిగిపడిన కొటమలే ప్రాంతం నుంచి పలువురిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. అంతేకాదు ఇప్పటికే 21 టన్నుల సామగ్రిని లంకకు పంపింది భారత్.
Operation Sagar Bandhu | Humanitarian Assistance
In the wake of the devastation caused by Cyclone Ditwah across Sri Lanka, India swiftly launched Operation Sagar Bandhu to bolster relief efforts.
The Indian Air Force promptly deployed one C-130 and one IL-76 from Hindan Air… pic.twitter.com/cIT7gKiPNs
— Indian Air Force (@IAF_MCC) November 29, 2025