ఢాకా: భారత ప్రధాని నరేంద్రమోదీకి బంగ్లాదేశ ప్రధాని షేక్ హసీనా ఘన స్వాగతం పలికారు. ఈ ఉదయం ఎయిరిండియా విమానంలో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని హజ్రత్ షాహజాలాల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి హసీనా పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.
అనంతరం బంగ్లాదేశ్ రక్షణ బలగాలు ప్రధాని మోదీకి గౌరవ వందనం సమర్పించాయి. బంగ్లా ప్రధాని షేక్ హసీనాతో కలిసి ఆయన వారి నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ బంగ్లాదేశ్‌కు వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ బంగ్లాదేశ్‌లోని పలు దర్శనీయ ప్రాంతాలను సందర్శించనున్నారు. అదేవిధంగా ప్రధానులిద్దరూ ఇరు దేశాల ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు.
#WATCH: PM Narendra Modi received by PM of Bangladesh Sheikh Hasina as he arrives in Dhaka on a two-day visit to the country. pic.twitter.com/oSC0f9prV8
— ANI (@ANI) March 26, 2021
Prime Minister Narendra Modi being accorded Guard of Honour upon his arrival in Bangladesh. Visuals from Hazrat Shahjalal International Airport in Dhaka. pic.twitter.com/NJBTa91Va0
— ANI (@ANI) March 26, 2021
Prime Minister Narendra Modi arrives in Dhaka on a two-day visit to Bangladesh pic.twitter.com/klmUgteQgQ
— ANI (@ANI) March 26, 2021