Narendra Modi | ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 12, 13 తేదీల్లో అమెరికాలో పర్యటించనున్నారు. ఈ సంగతి విదేశాంగశాఖ కార్యదర్శి విక్రం మిస్రీ శుక్రవారం వెల్లడించారు. గత నెల 20న అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని నరేంద్రమోదీ అమెరికాలో పర్యటించనుండటం ఇదే మొదటి సారి.
అమెరికాలో నివసిస్తున్న అక్రమ భారత వలసదారులను యూఎస్ మిలిటరీ విమానంలో పంపేస్తామని ప్రకటించిన కొన్ని రోజుల్లో ప్రధాని నరేంద్రమోదీ పర్యటిస్తుండటం గమనార్హం. ఈ నెల 10-12 తేదీల మధ్య ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరిగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్‌కు మోదీ కో-చైర్‌గా వ్యవహరించనున్నారు. జనవరి 27న ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఇమ్మిగ్రేషన్, ద్వైపాక్షిక సంబంధాలపై ఫోన్ చర్చలు జరిగాయి.