గురువారం 28 జనవరి 2021
International - Jan 02, 2021 , 17:30:56

అత్యధిక రేటింగ్‌ గల ప్రధాని.. నరేంద్ర మోదీ

అత్యధిక రేటింగ్‌ గల ప్రధాని.. నరేంద్ర మోదీ

వాషింగ్టన్‌ : అమెరికా డాటా సంస్థ మార్నింగ్ కన్సల్ట్ ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో భారత ప్రధాని నరేంద్ర మోదీ అత్యధిక రేటింగ్‌ గల ప్రధానిగా నిలిచారు. ఈ సర్వేలో 12 దేశాల ప్రపంచ నాయకులకు రేటింగ్‌ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీకి అత్యధిక ఆమోదం రేటింగ్ 55 శాతం లభించింది. ప్రతి వారం 13 దేశాల డాటా అప్‌డేట్ అవుతుందని సదరు సంస్థ పేర్కొన్నది. భారతదేశంలో మార్నింగ్ కన్సల్ట్ 2,126 మంది పెద్దలపై +/- 2.2 శాతం లోపం తేడాతో సర్వే నిర్వహించింది. ప్రధాని మోదీ నాయకత్వానికి 75 శాతం ఆమోదం పొందారని, డిసెంబర్ 21 నాటికి 20 శాతం మంది మాత్రమే అంగీకరించలేదని గుర్తించారు. చివరిసారిగా డిసెంబర్ 23 న నవీకరించబడిన డాటా ప్రకారం.. డొనాల్డ్ ట్రంప్, జస్టిన్ ట్రూడో, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, స్కాట్ మోరిసన్, ఏంజెలా మెర్కెల్, జైర్ బోల్సోనారో కంటే నరేంద్ర మోదీ ముందు వరుసలో ఉన్నారు. నరేంద్ర మోదీ నికర ఆమోదం రేటింగ్ 55 శాతం కాగా.. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నికర రేటింగ్ -27 శాతంగా ఉడటం విశేషం.

భారతదేశం, బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, ఇటలీ, జపాన్, మెక్సికో, దక్షిణ కొరియా, స్పెయిన్, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్‌లలో ప్రస్తుత ప్రపంచ నాయకుల ఆమోదం రేటింగ్‌లను మార్నింగ్ కన్సల్ట్ ట్రాక్ చేసింది. ఆయా దేశాల అధికారిక భాషలో ఈ సర్వే నిర్వహించారు. అమెరికాకు చెందిన డాటా సంస్థ ప్రపంచవ్యాప్తంగా నాయకత్వ ఆమోదాల గురించి రోజువారీ 11,000 ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నది. పొలిటికల్ ఇంటెలిజెన్స్, మార్నింగ్ కన్సల్ట్ తన యాజమాన్య వేదికను ఉపయోగించి ఎన్నుకోబడిన వారికి, ఓటింగ్ సమస్యలు, రాజకీయ ఎన్నికలకు రియల్ టైమ్ డాటాను అందిస్తుంది.

2019 లోక్‌సభ ఎన్నికలు జరిగిన ఏడాది తరువాత ఇండియా టుడే- కార్వీ ఇన్‌సైట్స్ మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్‌ను 2020 ఆగస్టులో ప్రచురించింది. దేశాన్ని తాకిన కరోనా వైరస్ మహమ్మారి మధ్య వచ్చిన అత్యంత ముఖ్యమైన ఈ సర్వే.. భారతీయులు మోదీ నాయకత్వంలో ఎలా సంతృప్తికరంగా కొనసాగుతున్నారో తెలియజేసింది. సర్వేలో పాల్గొన్న దాదాపు మూడింట రెండొంతుల మంది ప్రజలు ఆర్థిక సంక్షోభాన్ని మోదీ ప్రభుత్వం సమర్థంగా నిర్వహించడం పట్ల సంతోషంగా ఉన్నట్లు చెప్పారు. కరోనా వైరస్ మహమ్మారి వల్ల కలిగే ఆర్థిక ఇబ్బందులను మోదీ ప్రభుత్వం నిర్వహించడాన్ని కనీసం 71 శాతం మంది పౌరులు ‘అత్యుత్తమం’ లేదా ‘మంచి’ అని రేటింగ్‌ ఇచ్చారు. గత మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కంటే ఆర్థిక సంక్షోభాన్ని మోదీ ప్రభుత్వం బాగా నిర్వహించిందని సర్వేలో పాల్గొన్న 43 శాతం మంది చెప్పారు. ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించడంలో గత ప్రభుత్వంతో పోల్చినప్పుడు మోదీ ప్రభుత్వం బాగున్నదని కనీసం 88 శాతం మంది అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి..

మనకు ఆనందం.. వాటికి ప్రాణసంకటం


పాములతో బాడీ మసాజ్‌.. ఎక్కడైనా చూశారా?!


ప్రేక్షకులు లేకుండా భారత్‌- ఆసీస్‌ థర్డ్‌ టెస్ట్‌

ఈరోజు సూర్యుడికి ద‌గ్గ‌ర‌గా వెళ్ల‌నున్న భూమి

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo