G7 Summit : ఇటలీ వేదికగా జరుగుతున్న జీ7 సదస్సు నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ వరుస సమావేశాలతో బిజీగా గడుపుతున్నారు. మోదీ శుక్రవారం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమర్ జెలెన్స్కీతో భేటీ అయ్యారు. వీరితో పాటు పలువురు దేశాధినేతలతోనూ ప్రధాని మోద సంప్రదింపులు జరపనున్నారు.
దేశ ప్రధానిగా ఇటీవల వరుసగా మూడోసారి మోదీ పాలనా పగ్గాలు చేపట్టిన అనంతరం ఆయన తొలి విదేశీ పర్యటన ఇదే కావడం గమనార్హం. ప్రపంచ నేతలతో ఫలవంతమైన చర్చలతో అంతర్జాతీయ సవాళ్లను అధిగమించడంతో పాటు మెరుగైన భవిష్యత్ కోసం అంతర్జాతీయ సహకారం సాధించే దిశగా అడుగులు పడతాయని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
ఇక ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ మధ్య రక్షణ, అణు, అంతరిక్ష, విద్య, డిజిటల్ మౌలిక వసతులు సహా పలు రంగాల్లో భాగస్వామ్యాల బలోపేతంపై చర్చలు జరిగాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇరువురు నేతలు కీలక అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారని తెలిపింది. ఇక జీ7 సదస్సును ఉద్దేశించి కూడా ప్రధాని మోదీ ప్రసంగిస్తారని వెల్లడించింది.
Read More :