హైదరాబాద్ : నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించిన కేసులో మీర్పేట్ కార్పొరేటర్‌ను(Meerpet corporator) పోలీసులు అరెస్ట్(Nandakumar arrest) చేశారు. వివరాల్లోకి వెళ్తే..కరుణాకర్ అనే వ్యక్తి ల్యాండ్‌ను కార్పొరేటర్ కబ్జా చేసి నకిలీ ల్యాండ్ డాక్యుమెంట్స్‌తో వేరే వాళ్లకి అమ్మే ప్రయత్నం చేశాడు. సరిగ్గా రిజిస్ట్రేషన్ టైంకి రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఈ ల్యాండ్ వివరాలు బయటికి తియ్యడంతో నకిలీ డాక్యుమెంట్ భాగోతం బైట పడింది. దీనిపై ల్యాండ్ కరుణాకర్ కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విషయం తెలుసుకున్న కార్పొరేటర్ నందకుమార్ తిరుపతి పారిపోగా అక్కడికి వెళ్లి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.