కొలంబో : శ్రీలంకలో ఆగ్రహజ్వాలలు కొనసాగుతూనే ఉన్నాయి. రావణకాష్టంలా భగభగ మండుతూనే ఉంది. మాజీ ప్రధాని మహిందా రాజపక్సతో పాటు పలు ఎంపీల నివాసాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. శ్రీలంక రాజధాని కొలంబోకు 250 కిలోమీటర్ల దూరంలోని హంబన్‌తోటలో ఉన్న రాజపక్స పూర్వీకుల ఇంటిని సైతం ఆందోళనకారులు వదల్లేదు. ఆ ఇంటిని కూడా తగులబెట్టారు. దీంతో ఇల్లు పూర్తిగా కాలిపోయింది.
ఇక రాజపక్స రాజీనామా చేసినట్లు వార్తలు తెలియడంతో.. ఆందోళనకారులు రెచ్చిపోయారు. బస్సులు తగులబెట్టడం ప్రారంభించారు. ప్రభుత్వ ఆస్తులతో పాటు రాజపక్స తల్లిదండ్రుల స్మారకాలను ధ్వంసం చేశారు. శ్రీలంకలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, 190 మందికి పైగా గాయపడ్డారు. ఆందోళనలను నిలువరించేందుకు బుధవారం ఉదయం వరకు కర్ఫ్యూ విధించారు.
PM Mahinda Rajapaksa’s ancestral home in Madamulluna has been set on fire. pic.twitter.com/JAN52w5Gxw
— DailyMirror (@Dailymirror_SL) May 9, 2022