ఇస్లామాబాద్: పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ నవ్వుల పాలయ్యారు. సియాల్కోట్ కంటోన్మెంట్ ఏరియాలో నకిలీ పిజా హట్(Pizza Hut)ను ఆయన ఓపెన్ చేశారు. అమెరికాకు చెందిన పిజా హట్ ఫుడ్ కంపెనీ తన స్టోర్‌ను పాకిస్థాన్‌లో ఓపెన్ చేస్తున్నట్లు హంగామా చేశారు. చాలా భారీ ఎత్తున ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓపెనింగ్ తర్వాత ఆ ఈవెంట్‌కు చెందిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యింది. రక్షణ మంత్రి పిజా హట్ ఔట్‌లెట్‌ను ఓపెన్ చేయడం ఏంటని ఆ కంపెనీ ఖంగుతిన్నది. దీంతో ఆ అంశంపై క్లారిటీ ఇచ్చింది. రెడ్రూఫ్ లోగోతో పిజా హట్‌ను ఓపెన్ చేయడం అనుమానాలు రేకెత్తించింది. లోగో, బ్రాండ్ అసలు కంపెనీ తరహాలో ఉండడంతో ఆన్లైన్లో వైరల్ అయ్యింది. కానీ పిజా హట్ వెబ్సైట్లో సియాల్కోట్ లొకేషన్ లేకపోవడం యూజర్లను తికమక పెట్టింది. దీంతో పిజాహట్ కంపెనీ అధికారికంగా స్పందించింది. తమ పేరు, లోగోతో సియాల్ కోట్ కంటోన్మెంట్లో ఔట్‌లెట్‌ను ఓపెన్ చేశారని పిజా హట్ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. నిజం తెలిసిన తర్వాత సోషల్ మీడియాలో పాక్ మంత్రికి వ్యతిరేకంగా మీమ్స్ వైరల్ అవుతున్నాయి.