వాషింగ్టన్: హెలికాప్టర్‌పై పైలట్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో ఆ హెలికాప్టర్ రెక్కలు విరగడంతోపాటు ఒక పక్కకు కూలిపోయింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రెండు కార్ల సమీపంలోని ఒక మొబైల్ మినీ హెలిప్యాడ్‌పై ఉన్న హెలికాప్టర్‌ను టేకాఫ్ కోసం పైలట్ ప్రయత్నించాడు. ఈ సందర్భంగా ఆ హెలికాప్టర్‌పై నియంత్రణ కోల్పోయాడు. గమనించిన ఒక వ్యక్తి ఆ పైలట్‌కు సూచనలు ఇచ్చేందుకు ప్రయత్నించాడు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. గాల్లోకి లేచిన ఆ హెలికాప్టర్ నియంత్రణ కోల్పోయి ఒక్కసారిగా పక్కకు కూలింది. దీంతో దాని రెక్కలు, తోక భాగం విరిగాయి.
కాగా, లాన్స్ అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘వీడియో లేకుండా బీమా కంపెనీకి దీనిని వివరించడానికి ప్రయత్నించండి’ అన్న శీర్షికతో చమత్కరించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు కూడా పలు విధాలుగా స్పందించారు. కొందరు ఫన్నీగా కామెంట్లు చేశారు.
Imagine tryna explain this to the insurance company without the video pic.twitter.com/fEg8DtS6Be
— Lance🇱🇨 (@BornAKang) December 28, 2022