VibMilk App | సిడ్నీ, నవంబర్ 3: పాకెట్ తెరవకుండానే అందులోని పాలు పాడయ్యాయో లేదో కచ్చితంగా తెలుసుకొనే యాప్‌ను ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌వేల్స్ యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. విబ్మిల్క్గా పిలిచే ఈ యాప్ స్మార్ట్ ఫోన్ వైబ్రేషన్ల (కంపనాలు) సాయంతో పాల నాణ్యతను చెప్పేస్తుంది. తాజా పాలు 6.6 పీహెచ్, పూర్తిగా పాడైనవి 4.4 పీహెచ్ కలిగి ఉంటాయి. స్మార్ట్‌ఫోన్‌లోని మోటార్‌ను ఉపయోగించి విబ్మిల్క్ యాప్ అంతర్గత కొలత యూనిట్ ఈ కంపనాలను నమోదు చేస్తుంది.
మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్స్‌ను ఉపయోగించి ఈ యాప్ 23 పీహెచ్ విలువ వరకు నమోదు చేస్తుంది. రెండు రకాల వైబ్రేషన్ మోటార్లను నాలుగు సాధారణ స్మార్ట్ఫోన్లలో ఉపయోగించి ఈ యాప్‌ను పరీక్షించారు. ఈ యాప్ పాల పీహెచ్ విలువను 98.35 శాతం కచ్చితత్వంతో, తాజా, పాడైపోయిన పాలను వంద శాతం కచ్చితత్వంతో గుర్తించింది. పాల ప్యాకెట్‌కు ఫోన్‌ను అతికించి పాలు పాడయ్యాయా లేదా తెలుసుకోవచ్చు. ఈ యాప్ యాప్ స్టోర్లలో డౌన్‌లోడ్‌కు ఇంకా అందుబాటులోకి రాలేదు.