బీజింగ్: కోటి విద్యలు కూటి కొరకేనంటూ శ్రమైక జీవన సౌందర్యం విలువైనదని చాటి చెప్తున్నాడు డింగ్ యువాన్ఝావో (39). ఉన్నత విద్యావంతుడైన ఆయన ఫుడ్ డెలివరీ చేస్తుండటం వైరల్ అయింది. ఆయన నన్యంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీలో బయాలజీలో పీహెచ్డీ చేశారు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి బయో డైవర్సిటీలో డిగ్రీ పొందారు. డింగ్ జాబ్ మార్కెట్లో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు.
అయినా, ఆయనకు తగిన ఉద్యోగం దొరకలేదు. తాను చేస్తున్న డెలివరీ బాయ్ ఉద్యోగంపై డింగ్ స్పందిస్తూ.. ‘ఈ ఆదాయంతో నేను నా కుటుంబాన్ని పోషించుకోగలను. కష్టపడి పనిచేస్తే, గౌరవప్రదంగా జీవించడానికి తగిన సొమ్ము సంపాదించుకోవచ్చు. ఇది చెడ్డ పని కాదు’ అని తెలిపారు. ఆయన వ్యాఖ్యలపై కొందరు స్పందిస్తూ విద్యకు విలువ ఏముందని ప్రశ్నించారు.