Maldives | భారత్ బాయ్‌కాట్ పిలుపుతో మాల్దీవులపై తీవ్ర ప్రభావం.. ఆందోళన వ్యక్తం చేసిన ఆదేశ మాజీ అధ్యక్షుడు
Maldives | భారత్-మాల్దీవుల మధ్య దౌత్య పరమైన (India - Maldives Row) వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ అంశంపై మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ (Mohamed Nasheed) ఆందోళన వ్యక్తం చేశారు.
Maldives | భారత్-మాల్దీవుల మధ్య దౌత్య పరమైన (India – Maldives Row) వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ అంశంపై మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ (Mohamed Nasheed) ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ ఇచ్చిన బాయ్ కాట్ పిలుపుతో మాల్దీవులు పర్యాటకంపై తీవ్ర ప్రభావం పడిందని అన్నారు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న నషీద్ మీడియాతో మాట్లాడారు.
‘భారత్ బాయ్‌కాట్ (Boycott Maldives) పిలుపు మాల్దీవుల పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం పడింది. దీనిపై నేను చాలా ఆందోళన చెందుతున్నాను. ఈ పరిస్థితి నెలకొన్నందుకు మాల్దీవుల ప్రజలను క్షమించండి. సెలవుల్లో మాల్దీవులకు రండి అని మేము భారతీయ ప్రజలను కోరుతున్నాము. మా ఆతిథ్యంలో ఎలాంటి మార్పూ ఉండదు. ఇరు దేశాల మధ్య సాధారణ పరిస్థితులు నెలకొనాలి. భారత పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కూడా కలిశాను. నేను ఆయన మద్దతు దారుడిని. ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నా’ అని నషీద్ తెలిపారు.
భారత్ ఎంతో బాధ్యతాయుత దేశమని ఈ సందర్భంగా మహమ్మద్ నషీద్ వెల్లడించారు. మాల్దీవులతో భారత్‌కు చారిత్రక సంబంధాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఇదే సందర్భంలో భారత్ సైనిక సిబ్బందిని వెనక్కి తీసుకోవాలని ప్రస్తుత అధ్యక్షుడు ముయిజ్జు తీసుకున్న నిర్ణయంపై కూడా ఆయన స్పందించారు. ఈ విషయంలో ఇరు దేశాలు చర్చించుకోవాలని సూచించారు.
మాల్దీవులు-చైనా మధ్య ఇటీవల కుదిరిన రక్షణ ఒప్పందంపై స్పందిస్తూ.. ఇరు దేశాల మధ్య కుదిరిన అగ్రిమెంట్ రక్షణ ఒప్పందం కాదని, కేవలం పరికరాల కొనుగోలు మాత్రమేనని తెలిపారు. ‘ప్రధానంగా రబ్బర్ బుల్లెట్లు, టియర్ గ్యాస్ వంటి కొన్ని పరికరాలను ముయిజ్జు కొనుగోలు చేయాలనుకుంటున్నారని నేను భావిస్తున్నాను. అవి అవసరమని ప్రభుత్వం భావించడం చాలా దురదృష్టకరం’ అని వ్యాఖ్యానించారు.
Also Read..
Gaza | గాజాలో విషాదం.. సాయం కోసం పంపిన పారాచూట్ విఫలమై ఐదుగురు మృతి
Bank Employees | భారీగా పెరగనున్న బ్యాంక్ ఉద్యోగుల వేతనాలు.. ఎంతంటే?
Rupert Murdoch | 93 ఏండ్ల వయసులో ఆరో పెండ్లి.. జూన్‌లో ఎలెనా జుకోవాతో రూపర్ట్ మర్దోక్ వివాహం
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

