Rupert Murdoch | 93 ఏండ్ల వయసులో ఆరో పెండ్లి.. జూన్‌లో ఎలెనా జుకోవాతో రూపర్ట్ మర్దోక్ వివాహం
మీడియా టైకూన్‌గా పేరుగాంచిన 93 ఏండ్ల రూపర్ట్ మర్దోక్ ఆరోసారి పెండ్లి చేసుకోబోతున్నాడు. 67 ఏండ్ల ఎలెనా జుకోవాతో నిశ్చితార్థం చేసుకున్న మర్దోక్.. కాలిఫోర్నియా వైన్ యార్డ్ ఎస్టేట్‌లోని మొరాగాలో జూన్‌లో పెళ్లికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు.
Rupert Murdoch | వాషింగ్టన్, మార్చి 8: మీడియా టైకూన్‌గా పేరుగాంచిన 93 ఏండ్ల రూపర్ట్ మర్దోక్ ఆరోసారి పెండ్లి చేసుకోబోతున్నాడు. 67 ఏండ్ల ఎలెనా జుకోవాతో నిశ్చితార్థం చేసుకున్న మర్దోక్.. కాలిఫోర్నియా వైన్ యార్డ్ ఎస్టేట్‌లోని మొరాగాలో జూన్‌లో పెళ్లికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. గతేడాది కూడా ముర్దోక్ రేడియో హోస్ట్ ఆన్లెస్లీ స్మిత్‌ను(ఐదో భార్య) వివాహం చేసుకున్నాడు. కానీ వీరి వివాహ బంధం నెల రోజుల కన్నా ఎక్కువ కాలం సాగలేదు.
ఎలెనా జుకోవా ఎవరు?
జుకోవా రష్యాకు చెందిన రిటైర్డ్ మాలిక్యులర్ బయాలజిస్ట్. మధుమేహం పరిశోధనలో స్పెషలిస్ట్. 1991లో మాస్కో నుంచి అమెరికాకు వెళ్లారు. మర్దోక్‌కు తన మూడో మాజీ భార్య డెంగ్ ఏర్పాటు చేసిన ఓ పార్టీలో జుకోవాతో పరిచయం ఏర్పడిందట. డెంగ్‌కు 2013లోనే మర్దోక్ విడాకులు ఇచ్చేశాడు. జుకోవా గతంలో రెండు సార్లు రష్యన్ ఆయిల్ బిలియనీర్ అలెగ్జాండర్ జుకోవ్‌తో పెండ్లి చేసుకున్నది. వారిద్దరికి ఓ కూతురు కూడా ఉన్నది. రూపర్ట్ మర్దోక్ నాల్గవ భార్య సూపర్ మోడల్ జెర్రీ హాల్. ఈమెకు 2022లో విడాకులు ఇచ్చాడు. మర్దోక్‌కు మొత్తం ఆరుగురు సంతానం ఉన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు.. ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిస్తున్న షాపు యజమాని
AP News | ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. ప్రకాశం జిల్లాలో దారుణం..!
Gopi Chand | వరుస పాన్ ఇండియా సినిమాలతో గోపీచంద్ కమ్‌బ్యాక్.. రిలీజ్ డేట్ల విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు!
Cyclone Arnab | ఏపీ తీరానికి అర్నబ్ తుపాను ముప్పు.. తెలంగాణ సహా 9 రాష్ట్రాల్లో భారీ వర్షాలు!
Burns crop | నీళ్లు లేక కరెంట్ రాక.. సూర్యాపేట జిల్లాలో పంటను కాలబెట్టిన కౌలు రైతు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

